
తమిళనాడు రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిని ఓడించి ‘జెయింట్ కిల్లర్’గా గుర్తింపు పొందిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
వీఎస్ బాబు ఆరోగ్య సమస్యల కారణంగా సెప్టెంబర్‌లో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం గురువారం ఒక్కసారిగా విషమించింది. ఈ క్రమంలో కార్డియాక్ అరెస్ట్‌కు గురై మరణించినట్లు సమాచారం. ఆయన మృతితో టీవీకే శ్రేణుల్లో విషాదం నెలకొంది.
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. స్టాలిన్‌పై 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వీఎస్ బాబు.. సెప్టెంబర్‌లో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఆశించిన మెరుగుదల కనిపించలేదు. చివరకు గురువారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్‌కు గురై తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.
ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఓడించడంతో వీఎస్ బాబు అప్పట్లో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. స్టాలిన్ ఓటమిపై సోషల్ మీడియాలో జరిగిన చర్చల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. 75 ఏళ్ల వయసులో ఆయన మరణవార్త తెలియడంతో టీవీకే పార్టీ శ్రేణులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
