తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం సుమారు 10 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

మరోవైపు బుధవారం మొత్తం 77,092 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,615 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ.4.55 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ తెలిపింది.

అలాగే 4.19 లక్షల లడ్డూలను విక్రయించగా, 1.81 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *