
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు ఒక వ్యక్తి పుట్టిన తేదీని ధ్రువీకరించే అధికారిక పత్రం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ చట్టం ప్రకారం ఆధార్ సంఖ్యను వ్యక్తి గుర్తింపునకు రుజువుగా మాత్రమే పరిగణిస్తారని వెల్లడించింది.
ఈ సందర్భంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) 2018లో జారీ చేసిన కార్యాలయ మెమొరాండాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఆధార్ కార్డులో నమోదయ్యే జనన తేదీ, కార్డుదారుడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు లేదా స్వీయ ప్రకటన ఆధారంగా ఉంటుందని పేర్కొంది.
అందువల్ల ఆధార్ కార్డులో ఉన్న జనన తేదీని వ్యక్తి పుట్టిన తేదీకి అధికారిక ధ్రువీకరణగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ ప్రధాన ఉద్దేశం వ్యక్తి గుర్తింపును నిర్ధారించడమేనని తెలిపింది.
