
ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6’ (GTA 6) ఎట్టకేలకు గురువారం (నవంబర్ 19) విడుదలైంది. 2013లో ‘GTA 5’ వచ్చిన దాదాపు 13 ఏళ్ల తర్వాత రాక్‌స్టార్ గేమ్స్ ఈ కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలు సృష్టించిన ఈ యాక్షన్-అడ్వెంచర్ గేమ్.. గేమింగ్ ప్రపంచంలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.
PS5, Xbox కన్సోల్స్‌పై అందుబాటులో..
ప్రస్తుతం ఈ గేమ్ ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ X/S కన్సోల్స్‌పై అందుబాటులో ఉంది. భారత్‌లో స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.5,999గా, అల్టిమేట్ ఎడిషన్ ధర రూ.7,499గా నిర్ణయించారు. సింగిల్ ప్లేయర్ అనుభవంతో రూపొందించిన ఈ గేమ్‌లో ఆటగాళ్లు కొత్త ప్రపంచాన్ని అన్వేషించవచ్చు.
నిమిషాల్లోనే GTA 6 డెలివరీ..
భారత్‌లో గేమ్ విడుదల సందర్భంగా క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ ప్రత్యేక సేవను ప్రారంభించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో GTA 6 ప్లేస్టేషన్ 5 వెర్షన్‌ను నిమిషాల వ్యవధిలోనే ఇంటి వద్దకు చేరుస్తోంది. హైదరాబాద్‌తో పాటు దిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా, బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
అయితే బ్లింకిట్ ద్వారా డెలివరీ చేసే బాక్స్‌లో గేమ్ డిస్క్‌కు బదులుగా డిజిటల్ డౌన్లోడ్ కోడ్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి PS5లో గేమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గేమింగ్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన GTA 6.. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
