పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. గొడవల నేపథ్యంలో ఎంపీని ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. గొడవల నేపథ్యంలో ఎంపీని ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈరోజు ఉదయం పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందులలో 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో భారీ సంఖ్యలో వాహనాలతో అవినాశ్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడురు దగ్గర ఎంపీ అవినాశ్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వాహనాలు ఎదురుపడ్డాయి. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అవినాశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
