మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. రొమ్ములో కణుతులు ఇతర అసాధారణ మార్పులను గుర్తించే అత్యాధునిక సెన్సార్ ఆధారిత ఐబ్రెస్ట్ పరికరాలను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా సుమారు రూ.56 కోట్ల విలువైన 750 ఐబ్రెస్ట్ పరికరాలు రాష్ట్రానికి చేరుకున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

త్వరలో నిర్వహించనున్న నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) సర్వేలో ఈ పరికరాలను వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా లక్షలాది మంది మహిళలకు ఈ పరికరాల ద్వారా రొమ్ము ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు.

మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ద్వారా సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మెడ్‌టెక్ ఛాలెంజ్ ద్వారా కృత్రిమ మేధ (AI) ఆధారిత వైద్య సేవల రంగంలో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ గుర్తింపు పొందిందని మంత్రి సత్యకుమార్ గుర్తుచేశారు.

ఆధునిక వైద్య సాంకేతికతను ప్రజలకు చేరువ చేయడంతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించే పరీక్షలను విస్తృతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *