రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంజీవని ప్రాజెక్టును పీపీపీ విధానంలో అమలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఆరోగ్యశాఖ కమిషనర్ చక్రధర్‌బాబు తెలిపారు.
జనవరి 1 నుంచి అమలుకు సర్కారు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంజీవని ప్రాజెక్టును పీపీపీ విధానంలో అమలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఆరోగ్యశాఖ కమిషనర్ చక్రధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద అమలవుతున్న పలు పథకాల పనితీరును పరిశీలించేందుకు రెండు కేంద్ర బృందాలు శనివారం రాష్ట్రానికి విచ్చేశాయి.
ఆదివారం నుంచి ఈనెల 26 వరకు అల్లూరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నాయి. శనివారం కేంద్ర బృందాల ప్రతినిధులతో కమిషనర్ సమావేశమయ్యారు. డిసెంబరు 10న రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించి, జనవరి 1 నుంచి 28 జిల్లాల్లో సంజీవని ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
