
చదువు కోసం పల్నాడు ప్రాంతం నుంచి అమెరికాకు వెళ్లిన యువకుడు అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. బాగా స్థిరపడటంతో పెళ్లి కూడా చేసుకున్నాడు. రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒహియో రాష్ట్రం కీవ్‌లాండ్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసిన యువకుడు.. ఆ గృహ ప్రవేశానికి తల్లిదండ్రులను కూడా అమెరికాకు తీసుకొచ్చాడు. అంతా సంతోషంగా ఉన్నారు అనుకున్న సమయంలో సడెన్‌గా హార్ట్ ఎటాక్‌కు గురయ్యాడు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్ చేసినా ప్రాణాలు మాత్రం దక్కలేదు.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.. బాాగా కష్టపడి చదవి, అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. సంపాదనలో బాగా స్థిరపడిన ఆ యువకుడు ఓ సొంత ఇంటిని కూడా కట్టుకున్నాడు. ఆ గృహప్రవేశ కార్యక్రమానికి తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాడు. కొడుకు ఎదుగుదల చూసి పొంగిపోయిన ఆ తల్లిదండ్రులు అంతలోనే కుంగిపోయారు. అందరితో కలిసి సరదాగా భోజనం చేసిన ఆ యువకుడు సడెన్‌గా హార్ట్ అటాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనతో పల్నాడులో విషాద ఛాయలు అలముకున్నాయి.
పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రావిపాటి వెంకట రవితేజ (34) 2019లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒహియో రాష్ట్రం కీవ్‌లాండ్‌లో నివాసం ఉంటున్న అతను.. ఇటీవలే కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుని, ఆ వేడుకల్లో పాల్గొనేందుకు అతడి తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, శ్రీనివాసరావు కూడా అమెరికా వెళ్లారు.

