Scheme: జస్ట్ దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు.. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

Date:

ఎస్బీఐ విద్యార్థులకు శుభవార్త అందించింది. రూ.15 వేల నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్ షిప్ అందించనుంది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైనవారు అప్లై చేసుకోవాలని సూచించింది. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతోంది.

కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్ధిక భారంతో చదువుల కోసం ఫీజు కట్టలేని విద్యార్థులకు ఆర్దిక సాయం అందించనుంది. మెరిట్ మార్కులు వచ్చి, ఆర్ధిక పరిస్ధితుల కారణంగా ఫీజులు కట్టలేని స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్‌లు అందించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ఇది వర్తించనుంది. స్కూల్ స్థాయి నుంచి ఐఐటీ స్థాయి వరకు ఏ విద్యార్థులైనా దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి పరిస్థితి, కాలేజీ స్థాయిని బట్టి రూ.15 వేల నుంచి రూ.15 లక్షల వరకు అందించనుంది. ఎంపికైన వారికి నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ఇవి జమ చేయనుంది. దేశవ్యాప్తంగా 25 వేల మందికి అందించాలని నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా ఈ స్కీమ్ ద్వారా ఎస్బీఐ లక్షలాది మంది విద్యార్థులకు అండగా నిలుస్తోంది.  ఈ సారి కూడా దానిని కొనసాగిస్తోంది.

అర్హతలు ఏంటి..?

-గత విద్యా సంవత్సరంలో కనీసం 75 శాతం మార్కులు వచ్చి ఉండాలి

-ప్రీమియర్ విద్యా సంస్థల్లో నమోదు చేసుకుని ఉండాలి

స్కూల్స్ విద్యార్థుల వార్షిక కుటుంబం ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉండాలి

-కాలేజీ స్టూడెంట్స్ కుటుంబ ఆదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి

-9 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులతో పాటు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంబీబీఎస్, ఐఐటీ, ఐఐఎం, మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్లేవారు కూడా అర్హులు

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

www.sbiashascholarship.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అందులోకి వెళ్లి మీ అర్హతను పరిశీలించుకోవాలి. అనంతరం మీ వివరాలు, డాక్యుమెంట్స్ సమర్పించి అప్లై చేసుకోవాలి. కోర్సు పూర్తయ్యే వరకు స్కాలర్ షిప్ ప్రతీ ఏడాది అందిస్తారు. సెప్టెంబర్ 4,2026 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. దేశంలోనే అతిపెద్ద స్కాలర్ షిప్ స్కీమ్‌గా ఉంది ఉంది. కేటగిరిని బట్టి రూ.15 వేల నుంచి రూ.15 లక్షల వరకు పొందవచ్చు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఈ స్కాలర్ షిప్ కోసం రూ.100 కోట్లను ఎస్‌బీఐ కేటాయించింది. 2022లో ఈ స్కాలర్‌షిప్ ప్రొగ్రాంను ఎస్‌బీఐ ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తోంది. పేద విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిభ ఉండి పేదరికంతో చదువులకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నవారికి ఈ స్కాలర్‌షిప్ బాగా ఉపయోగపడనుంది. అర్హులైనవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, పరిశీలన తర్వాత స్కాలర్‌షిప్‌లు అందిస్తామని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....