IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ ‘IAM GAME’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్

Date:

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఐయామ్ గేమ్’. గత చిత్రం కాంత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాతో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని దుల్కర్ భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్‌ను పరిశీలిస్తే.. గ్యాంబ్లింగ్, క్రికెట్ స్కామ్‌ల నేపథ్యంలో సాగే కథతో పాటు అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన ఛేజింగ్ సన్నివేశాలు, హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి నుంచి చివరి వరకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది.

తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. “IAM GAME ట్రైలర్‌లోని వైబ్ అద్భుతంగా ఉంది. మొదటి నుంచి చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా సాగింది. నా సోదరుడు దుల్కర్ సల్మాన్ మరో ప్రత్యేకమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనే నమ్మకం ఉంది. ఈ గేమ్‌లో అతను తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దుల్కర్‌తో పాటు చిత్రబృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.

దుల్కర్ సల్మాన్ తన సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై జోమ్ వర్గీస్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, తమిళ దర్శకుడు-నటుడు మిస్కిన్, ఆంటోని వర్గీస్, కథిర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దక్షిణ భారతదేశంలోని 100కుపైగా లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఆగస్టు 20న ఓనం సందర్భంగా మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...