శరవేగంగా రిటైనింగ్ వాల్ పనులు.. కృష్ణా వరదల నుంచి ప్రజలను కాపాడేందుకే!

Date:

తాడేపల్లి పరిధిలోని సీతానగరం నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 0.900 కిలో మీటర్ల నుంచి 2.010 కిలోమీటర్ల వరకు రూ. 294.20 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కృష్ణానది వరద ముంపు ముప్పు నుంచి కాపాడేందుకు ఈ ఏడాది మార్చిలో ఈ పనులు ప్రారంభించారు. ఎన్నికల సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది.

కృష్ణా నది వరద ముంపు ప్రాంతాల నుంచి కాపాడేందుకు మొదలుపెట్టిన రిటైనింగ్ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయవాడలో కృష్ణలంక ప్రాంతం గతంలో వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురి కాలేదు. దానికి కారణం రిటైనింగ్ వాల్ నిర్మించడమే. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన రిటైనింగ్ వాల్ పనులను వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసింది. ఆ కారణంగా గతంలో కృష్ణానది వరదల నుంచి కృష్ణలంక ప్రాంతం ముంపునకు గురికాకుండా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

కృష్ణలంక ప్రాంతంలో ఏర్పాటు చేసిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు మాదిరిగానే గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం, మహానాడు ప్రాంతాల్లో కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు మహానాడు ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు.

ఈ ఏడాది మార్చిలో ప్రకాశం బ్యారేజీ దిగువ 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు కృష్ణానది కుడివైపు దిగువన ఈ రక్షణ గోడ నిర్మించేందుకు మంత్రి నారా లోకేశ్ భూమి పూజ కూడా చేశారు. రూ. 294.20 కోట్ల వ్యయంతో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కృష్ణానదికి వరద వచ్చిన సమయంలో నదికి కుడి వైపు ఉన్న సీతానగరం, మహానాడు ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...