అమ్మవారికి సమర్పించే బోనం ఎన్ని రకాలుగా చేస్తారు? ఒక్కో బోనం వెనుక ఉన్న మహత్యం ఇదే!

Date:

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాలు అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతాయి. ఊరూ వాడా ఏకమై శక్తి స్వరూపిణి అయిన గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం తెలుగువారికి మాత్రమే సొంతమైన ఒక అరుదైన, విశిష్టమైన సంస్కృతి. ఇంతకీ బోనం అంటే ఏమిటి? అందులో ఏముంటుంది..? ఇప్పుడు చూద్దాం..

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాలు అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతాయి. ఊరూ వాడా ఏకమై శక్తి స్వరూపిణి అయిన గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం తెలుగువారికి మాత్రమే సొంతమైన ఒక అరుదైన, విశిష్టమైన సంస్కృతి. ఇంతకీ బోనం అంటే ఏమిటి? అందులో ఏముంటుంది..? ఇప్పుడు చూద్దాం..

భోజనం అనే సంస్కృత శబ్దానికి వికృతి రూపమే బోనం. జగజ్జనని అయిన అమ్మవారికి మన ఇంట్లోనే భోజనం తయారుచేసి నివేదించే ఈ అద్భుతమైన సంప్రదాయం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. తమను, తమ కుటుంబాలను, ఊరిని ఎలాంటి ఆపదలు, రోగాలు రాకుండా చల్లగా చూడాలని కోరుకుంటూ భక్తులు ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

ఇలా అమ్మవారికి సమర్పించే బోనాన్ని ఎంతో నిష్ఠతో, పరిశుభ్రతతో తయారుచేస్తారు. ఈ భోనాలు అనేక రకాలుగా తయారు చేస్తారు. కొందరు బెల్లం బువ్వ బోనం చేస్తే, మరికొందరు పచ్చబువ్వతో బోనం వండుతారు. కోరిన కోర్కెలు తీరిన కొందరు అమ్మవారికి వెయ్యి కండ్ల బోనం సమర్పించుకుంటారు.

ఇందుకోసం రాగి లేదా మట్టి కుండను ముందుగా అందులో నైవేధ్యం వండుతారు. దీన్ని కొందరు బెల్లంతో పరమాన్నం వండుతారు.. మరికొందరు పసుపు వేసి పచ్చటి అన్నం వండుతారు. అనంతరం ఆ పాత్ర పై భాగాన్ని నీటితో శుభ్రం చేస్తారు. ఇప్పుడు దానికి తెల్ల సున్నం, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, వేపాకులు, పూలతో అందంగా అలంకరిస్తారు.

ఇవి రెండు పాత్రలు ఉంటాయి. అడుగున ఉన్న దాంట్లో ముందుగా బెల్లంతో వండిన అన్నం పరమాన్నం, కట్టె పొంగలి లేదంటే పసుపు వేసి వండిన అన్నంలో అమ్మవారికి ఇష్టంగా చెప్పుకునే పొన్నగంటి ఆకు కూర వండి పెడతారు. ఇక ఆ పైన మరో చిన్న పాత్రను పెడతారు. ఇందులో బెల్లం షాక లేదంటే పెరుగుతో నింపుతారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...