తిరుమల శ్రీవారి భక్తులకు కొత్త సర్వీస్.. గంటలో తిరుపతికి.. పూర్తి వివరాలివే

Date:

హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లేవారికి తీపికబురు. శంషాబాద్ నుంచి తిరుపతికి ప్రతి రోజూ డైరెక్ట్‌ విమాన సర్వీసులను అందుబాటులోకి రాబోతున్నాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ విమానాలు అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విమానం బయలుదేరి.. తిరుపతికి 2.40 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 4.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

హైదరాబాద్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. నగరం నుంచి తిరుపతికి వెళ్లేవారు కూడా ఉన్నారు.. వీరిలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లేవారు కూడా ఉంటారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతికి ప్రతి రోజూ విమాన సర్వీసులు నడుస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి కొత్తగా విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులను ప్రారంభించనుంది. సెప్టెంబరు 1 నుంచి ప్రతిరోజూ తిరుపతి, చెన్నై నగరాలకు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎయిర్‌ ఇండియా తెలిపింది.

విమానాశ్రయ నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 1.30 గంటలకు ఎయిర్ ఇండియా విమానం బయల్దేరుతుంది.. తిరుపతికి మధ్యాహ్నం 2.40 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. మధ్యాహ్నం 3.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి హైదరాబాద్‌‌కు 4.30 గంటలకు చేరుకుంటుంది. అంతేకాదు శంషాబాద్‌ నుంచి చెన్నైకి ప్రతి రోజూ ఉదయం 8.05 గంటలకు విమానం బయల్దేరుతుంది.. చెన్నైకు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటుంది. ఎయిర్‌ ఇండియా సెప్టెంబరు 1 నుంచి మరికొన్ని నగరాలకు విమాన సర్వీసుల విస్తరిస్తోంది. హైదరాబాద్‌ నుంచి కోయంబత్తూర్, మదురై, జోధ్‌పూర్, జామ్‌నగర్, ఔరంగాబాద్‌కు కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తోంది.

కొంతకాలంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే విమాన సర్వీసులకు డిమాండ్ పెరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో టీటీడీ ప్రతి రోజూ శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేస్తోంది. దీంతో ఈ టికెట్ల కోసం చాలామంది భక్తులు హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయల్దేరి తిరుపతి వెళుతున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రతి రోజు 8 సర్వీసులు ఉన్నాయి. వీటిలో ఉదయం 7.20 గంటలకు, 8.30 గంటలకు వెళ్లే వమానాలకు డిమాండ్ ఉంది. దీంతో తిరుపతికి వెళ్లే విమానాల టికెట్ ధర అమాంతం పెరిగాయి. హైదరాబాద్ టు తిరుపతి గంట ప్రయాణానికి రూ. 5,700 నుంచి రూ. 24 వేల (చివరి నిమిషంలో) వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఈ విమాన సర్వీసుల టికెట్లకు డిమాండ్ ఉంటోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...