AP EAPCET 2026 కౌన్సెలింగ్‌ తొలి విడతలో లక్షకు పైగా సీట్లు భర్తీ.. ప్రైవేటు వర్సిటీలదే జోరు

Date:

ఇంజినీరింగ్‌ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 70.87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 9న కౌన్సెలింగ్‌ వివరాలను వెల్లడించింది. గత రెండేళ్లుగా ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీ లక్ష దాటుతుండగా.. ఈ ఏడాది తొలి విడతలోనే లక్షకుపైగా సీట్లు భర్తీ కావడం విశేషం…

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 70.87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 9న కౌన్సెలింగ్‌ వివరాలను వెల్లడించింది. గత రెండేళ్లుగా ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీ లక్ష దాటుతుండగా.. ఈ ఏడాది తొలి విడతలోనే లక్షకుపైగా సీట్లు భర్తీ కావడం విశేషం. ఈఏపీసెట్‌లో ఈ ఏడాది 1,74,802 మంది అర్హత సాధించారు. వీరిలో 1,13,488 మంది ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 1,12,285 మంది ప్రవేశాలకు అర్హత సాధించారు. వీరు తమకు నచ్చిన బ్రాంచీలు, కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కలిపి మొత్తం 239 విద్యాసంస్థల్లో కన్వీనర్‌ కోటా కింద 1,51,312 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో వీటిలో 1,07,239 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 44,073 సీట్లు మిగిలిపోయాయి. ఇక క్రీడా కోటాలోని 666 సీట్లను ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. క్రీడా సర్టిఫికెట్లకు సంబంధించి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) నుంచి మెరిట్‌ జాబితా అందకపోవడంతో ఈ సీట్ల భర్తీని నిలిపివేశారు. ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో విద్యార్థులు ప్రైవేటు విశ్వవిద్యాలయాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మొత్తం 14,567 సీట్లు ఉండగా.. వాటిలో సుమారు 92 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో కలిపి 9,347 సీట్లు అందుబాటులో ఉండగా.. వీటిలో 87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి

రెండేళ్లుగా లక్ష దాటుతున్న భర్తీ

కన్వీనర్‌ కోటాలో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీ గత రెండేళ్లుగా లక్ష దాటుతోంది. ఈ ఏడాది కూడా తొలి విడతలోనే 1.07 లక్షలకుపైగా సీట్లు భర్తీ కావడంతో ఇంజినీరింగ్‌ విద్యపై విద్యార్థుల ఆసక్తి కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. తొలి విడతలో మిగిలిన సీట్ల భర్తీకి తదుపరి దశ కౌన్సెలింగ్‌ కీలకం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...