భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

Date:

స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఖుదీరామ్ బోస్‌ దేశానికి చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు.

కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఖుదీరామ్ బోస్‌.. బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా భయంలేకుండా పోరాడిన వీరుడని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆయన ధైర్యం, దేశభక్తి నేటి యువతకు కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

స్వతంత్ర భారతాన్ని చూడలేకపోయినా.. ఖుదీరామ్ బోస్‌ త్యాగం స్వాతంత్ర్య పోరాటానికి బలమైన పునాదిగా నిలిచిందన్నారు. మాతృభూమిపై ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఆయన జీవితం చాటిచెబుతోందని తెలిపారు.

దేశ యువతలో ధైర్యం, దేశభక్తి, మాతృభూమిపై అంకితభావాన్ని ఖుదీరామ్ బోస్‌ పేరు ఎల్లప్పుడూ ప్రేరేపిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘‘భారత్ మాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్. జై హింద్’’ అంటూ తన ఎక్స్‌ పోస్టులో నివాళులర్పించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...