రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (AE) నియామకాలకు నిర్వహించనున్న రాత పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 23 నుంచి 27 వరకు నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో జేఎండీ సూర్య సాయి ప్రసాద్ వెల్లడించారు.

కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT) విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఆగస్టు 14 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.
అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకుని, అందులో పేర్కొన్న పరీక్షా కేంద్రం, సమయం, ఇతర సూచనలను పూర్తిగా పరిశీలించుకోవాలని అధికారులు తెలిపారు.

