విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే గిడ్డి!

Date:

D news: పి. గన్నవరం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పి. గన్నవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి త్రీ రోడ్స్ జంక్షన్ వరకు జరిగిన ఈ ర్యాలీని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.

జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు జాతీయ జెండా పట్ల గౌరవాన్ని చాటుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వికసిత భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. దేశ అభివృద్ధి, ఐక్యత కోసం తమ వంతు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, విద్యార్థులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...