తీరు మార్చుకోని NTA.. మళ్లీ అవే తప్పులు.. UGC NET 2026 పరీక్ష రద్దు!

Date:

వరుస పేపర్ లీకేజీలతో దేశ వ్యాప్తంగా అప్రతిష్ట మూట కట్టుకున్న ఎన్టీయే.. ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోసినా తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడంతో విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) జూన్ 2026 పరీక్షలకు సంబంధించి ఏకంగా మూడు సబ్జెక్టులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఎన్టీయే కీలక ప్రకటన చేసింది..

కమిటీ నివేదిక ప్రకారం.. ప్రశ్నపత్రాల్లో ప్రముఖ పండితుల పేర్లలో స్పెల్లింగ్ తప్పులు, పుస్తకాల పేర్లలో లోపాలు, ప్రశ్నల పదబంధాల్లో తప్పులు, వ్యాకరణ దోషాలు, లింగం-వచన అన్వయంలో పొరపాట్లు, విరామ చిహ్నాల తప్పులు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న భావాలకు ప్రామాణికం కాని పదాలను ఉపయోగించడం, గతంలో అడిగిన ప్రశ్నల్లో గణనీయమైన సంఖ్యలో ప్రశ్నలను మళ్లీ ఇవ్వడం వంటి లోపాలు కూడా ఉన్నట్లు కమిటీ గుర్తించింది. అభ్యర్థులందరికీ న్యాయమైన, లోపాలు లేని పరీక్షను నిర్వహించడం అవసరమని భావించిన కమిటీ.. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ మూడు పేపర్లను తిరిగి నిర్వహించాలని సిఫార్సు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా NTA రీ-కండక్ట్‌కు నిర్ణయం తీసుకుంది.

యూజీసీ నెట్‌ 2026 రీ-కండక్ట్ పరీక్షల తేదీలు ఇవే

NTA ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడు సబ్జెక్టుల పరీక్షలు కింది తేదీల్లో జరుగుతాయి..

  • ఇంగ్లిష్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 9, 2026 — షిఫ్ట్ 1, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
  • కామర్స్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 9, 2026 — షిఫ్ట్ 2, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
  • సోషియాలజీ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 10, 2026 — షిఫ్ట్ 1, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

ఈ మూడు సబ్జెక్టులకు చెందిన అభ్యర్థుల నుంచి రీ-కండక్ట్ పరీక్ష కోసం ఎలాంటి అదనపు పరీక్ష ఫీజు వసూలు చేయబోమని NTA స్పష్టం చేసింది. పరీక్ష నగరం, పరీక్ష కేంద్రం, అడ్మిట్ కార్డుకు సంబంధించిన వివరాలను తదుపరి దశలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తామని తెలిపింది. మరోవైపు NTA 84 సబ్జెక్టులకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలను విడుదల చేసింది. ఈ 84 సబ్జెక్టులకు సంబంధించిన UGC NET 2026 ఫలితాలను నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ప్రకటిస్తామని NTA తెలిపింది. అలాగే ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు రీ-కండక్ట్ పరీక్ష నిర్వహిస్తున్న కారణంగా మిగిలిన 84 సబ్జెక్టులకు సంబంధించిన JRF సీట్ల కేటాయింపు, ఈ-సర్టిఫికెట్ల జారీ ఆలస్యం కాదని NTA స్పష్టం చేసింది. అభ్యర్థులు రీ-కండక్ట్ పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం, పరీక్ష కేంద్రం, సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డు వంటి వివరాల కోసం NTA అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...