2026 సంవత్సరం విజయ్ దేవరకొండకు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎంతో ప్రత్యేకంగా మారింది. లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ రష్మిక మందన్నను వివాహం చేసుకుని బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో రష్మిక కూడా దేవరకొండ ఇంటి కోడలిగా మారింది. పర్సనల్ లైఫ్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన విజయ్.. ఇప్పుడు పూర్తిగా కెరీర్‌పై ఫోకస్ పెడుతున్నాడు.

ఇక దేవరకొండ కుటుంబం నుంచి వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన కొత్త సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ‘ఎపిక్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ‘గం గం గణేశా’ తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా ఇదే. ‘90స్ బయోపిక్’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.

అక్టోబర్‌లో విజయ్-రష్మిక జోడీ

అక్టోబర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘రణబలి’ షూటింగ్ సమయంలోనే వివాహం చేసుకున్న ఈ రీల్ కపుల్.. పెళ్లి తర్వాత కూడా కలిసి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ ‘దసరా’ అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే విజయ్-రష్మిక కాంబినేషన్‌లో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ జోడీ మరోసారి స్క్రీన్‌పై కనిపించనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

నవంబర్‌లో రష్మిక సోలో మూవీ

అక్టోబర్ తర్వాత నవంబర్‌లో రష్మిక మందన్న తన మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. హై-ఆక్టేన్ యాక్షన్ మూవీ ‘మైసా’ నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

పెళ్లి తర్వాత దేవరకొండ కుటుంబం నుంచి వరుసగా సినిమాలు రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా విజయ్, ఆనంద్ దేవరకొండలకు గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాలు కీలకంగా మారాయి. మరి రష్మిక లక్.. విజయ్, ఆనంద్‌లకు సక్సెస్‌ను అందిస్తుందా? దేవరకొండ ఫ్యామిలీకి 2026 నిజంగానే సక్సెస్‌ఫుల్ ఇయర్‌గా నిలుస్తుందా? తెలియాలంటే సినిమాల విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *