ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే కేవైసీ లేదా గుర్తింపు ధృవీకరణ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ముఖ్యం.

మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే చాలా సింపుల్.. నిమిషాల వ్యవధిలోనే అప్డేట్ చేసుకోవచ్చు. ఓటీపీలు అందుకునేందుకు ఆధార్‌కు మొబైల్ నెంబర్ అనుసంధానించడం అనేది తప్పనిసరి. లేకపోతే మీరు ఎలాంటి ఆధార్ ధృవీకరణ పూర్తి చేయలేరు. గతంలో మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీ మొబైల్ నుంచే సులువుగా ఎక్కడినుంచైనా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ ఒక యాప్ తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఆధార్ యాప్‌లో రిజిస్టర్ అవ్వడం ఎలా..?

-ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి

-అనంతరం యాప్‌ ఓపెన్ చేసి మీ భాషను ఎంచుకోవాలి

-ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిబంధనలు, గోప్యా విధానాన్ని అంగీకరించాలి.

-సిమ్ కార్డును సెలక్ట్ చేసుకుని ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి

-ఆ తర్వాత యాప్‌లో ఆరు అంకెల సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోవాలి

ఆధార్ యాప్ ద్వారా మొబైల్ నెంబర్ మార్చుకోవడం ఎలా..?

-యాప్‌లో మొబైల్ నెంబర్ అప్డేట్ ఆప్షన్ ఎంచుకోండి

-కొత్త మొబైల్ నెంటర్‌ను ఎంటర్ చేసి ఓటీపీతో ధృవీకరించండి

-ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయండి

-నిర్ణీత రుసుం చెల్లించండి

-కొద్ది రోజుల్లో మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది

పాత మొబైల్ నెంబర్ లేకపోతే ఏం చేయాలి..?

పాత మొబైల్ నెంబర్ యాక్టివ్‌లో లేకపోతే మీరు సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే పాత మొబైల్ నెంబర్ యాక్టివ్‌లో ఉండే ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సిన పని ఉండదు. ఇక మీరు మొదటిసారిగా మొబైల్ నెంబర్ లింక్ చేయాలన్నా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ సేవలు సులువుగా పొందేకు OTP ఆధారిత ధృవీకరణకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది అవసరం. మీరు మొబైల్ నెంబర్ అప్‌డేట్‌గా ఉంచుకోవడం వల్లన అవసరమైనప్పుడు ప్రామాణీకరణను పూర్తి చేయవచ్చు. అలాగే ఆధార్ సేవలను పొందడానికి మీకు సహాయపడుతుంది. నెంబర్ మార్చుకోవడం వల్ల OTPలు, ఇతర అవసరమైన సమాచారాలు మీ ప్రస్తుత నంబర్‌కు అందుతాయి.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *