పుంగనూరులో టీడీపీ జెండా ఎగరాలి

Date:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరులో టీడీపీ జెండా ఎగిరేలా సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం పుంగనూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో రూ.59 లక్షలతో అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ జి.నరసింహయాదవ్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.

పుంగనూరు, మార్చి8 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరులో టీడీపీ జెండా ఎగిరేలా సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం పుంగనూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో రూ.59 లక్షలతో అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ జి.నరసింహయాదవ్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకంటే పుంగనూరులో టీడీపీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కనీసం టీడీపీ మీటింగ్‌లు కూడా పెట్టనిచ్చేవారు కాదన్నారు. చంద్రబాబును అడ్డుకోవడం, దాడులకు దిగడంతో భరించలేక పార్టీ శ్రేణులు తిరగబడితే వందలాది మందిపై పెద్దిరెడ్డి అక్రమ కేసులు పెట్టించారని గుర్తుచేశారు. 2029లో పుంగనూరులో టీడీపీ గెలుపును ఏశక్తీ అడ్డుకోలేదని జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌ యార్డులో చింతపండు వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కాగా, అంతకుముందు ఓ కల్యాణ మండపంలో జరిగిన మహిళా దినోత్సవంలో మంత్రి పాల్గొని నియోజకవర్గంలోని 3,338 మహిళా సంఘాలకు మంజూరైన రూ.417.13 కోట్ల చెక్కును అందజేశారు. మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. బి.నరసింహయాదవ్‌ మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీరామారావుదేనన్నారు. ఏఎంసీ చైర్మన్‌ శమిపతి యాదవ్‌ మార్కెట్‌యార్డు, రైతు సమస్యలపై మంత్రికి విన్నవించారు. టీడీపీ మాజీ ఇన్‌చార్జి ఎం.వెంకటరమణరాజు, సింగిల్‌విండో చైర్మన్‌ పగడాల రమణ, టీడీపీ నాయకులు మాధవరెడ్డి, సీవీరెడ్డి, అంజిరెడ్డి, పర్వీన్‌, సుహేల్‌బాషా, సద్దాంహూసేన్‌, షామీర్‌బాషా, రామకృష్ణమరాజు, మోహన్‌రెడ్డి, వెంకటరెడ్డి, ఇబ్రహీం, ఆంజి, గంగాధర్‌, రమణ, చంద్ర, ప్రసాద్‌, జనసేన నాయకులు విరూపాక్షి, హరినాయక్‌, బాలాజీనాయక్‌, బీజేపీ నాయకులు జగదీ్‌షరాజు, వెంకటరెడ్డి, అధికారులు పాల్గొన్నారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...