Weather Report: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక పెరగనున్న భానుడి భగభగలు.. ప్రజలకు అలర్ట్

Date:

ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది వాటి వివరాలు. దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి /దక్షిణ దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో ఆగ్నేయం దిశగా గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతవారణశాఖ తెలిపింది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉంటాయనే దానిపై వాతావరణశాఖ అధికారులు ఓ వెదర్ బులిటెన్ విడుదల చేశారు. ఈ బులిటెన్ ప్రకారం ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హెచ్చరించింది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా రాబోయే మూడ్రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడుతుందని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్, యానములో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర క్రమంగా పెరిగే అవకాశముందని అంచనా వేసింది. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండ ప్రభావం పెరగడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తుండగా.

మధ్యాహ్నం వేళ ఎండ వేడి మరింత పెరుగుతోంది. దీంతో పాటు ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మార్చిలోనే భానుడు ఉగ్రరూపం దాల్చుతుండగా.. ఏప్రిల్ నాటికి ఎండలు భగ్గుమనే అవకాశముంది. దీంతో ఎండలపై తాజాగా హోంమంత్రి అనిత అధికారులతో సమావేశమయ్యారు. సమ్మర్‌లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. విపత్తు నిర్వహణశాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్లు, లైన్ డిపార్టమెంట్ అధికారులు కూడా హాజరయ్యారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...