భారత్‌లోకి చైనా పెట్టుబడులు.. ‘గల్వాన్’ ఘర్షణ తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.. ఎట్టకేలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Date:

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సరిహద్దును పంచుకునే చైనా సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలపై నిబంధనలు, పరిమితుల్ని కొంత వరకు సడలించింది. గతంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే కచ్చితంగా ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఆ నిబంధనను తొలగించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం రోజు పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది. ఇందులో భాగంగానే.. భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే  చైనా సహా భారత్‌తో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై కఠిన నిబంధనల్ని సడలించి.. పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది. చైనా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, అప్ఘానిస్థాన్, మయన్మార్, పాకిస్థాన్ ఇలా మన పొరుగు దేశాలు.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే కచ్చితంగా ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనల్ని సడలించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు.. పొరుగు దేశాల కంపెనీలు.. భారత్‌లోని ఏ రంగంలోనైనా ప్రభుత్వ అనుమతి లేకుండా 10 శాతం వరకు పెట్టుబడుల్ని పెట్టొచ్చు. ఇక్కడ ఆటోమేటిక్ రూట్‌లో 10 శాతం లోపు ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఆ పరిమితి దాటితే మాత్రం అనుమతి ఇప్పటికీ తప్పనిసరిగా ఉంది.

గతంలో మన దేశంలోని ఏ రంగంలో అయినా మన సరిహద్దు దేశాలు పెట్టుబడులు పెట్టాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండగా.. తాజాగా దీన్ని తొలగించారు. ఈ మేరకు గతంలో తీసుకొచ్చిన ప్రెస్‌నోట్3 ని సవరించారు. ఇక ఎఫ్‌డీఐల విషయంలో రంగాల వారీగా ఉన్న పరిమితులు యథాతథంగానే కొనసాగుతాయని తెలిపింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...