
మీరు రూపే డెబిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. రూపే డెబిట్ కార్డుల ద్వారా అందిస్తున్న పలు సేవలను ఇకపై పొందలేరు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ నిబంధనలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మార్చింది. పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహా ఇతర బ్యాంకులు సైతం ఈ కొత్త మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిజిటల్ పేమెంట్ల నియంత్రణ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపే డెబిట్ కార్డులకు సంబంధించి కీలక మార్పులు చేసింది. రూపే డెబిట్ కార్డులపై ప్రస్తుతం అందిస్తున్న. ఈ మేరకు బ్యాంకులకు ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. కొత్త రూల్స్ కారణంగా రూపే డెబిట్ కార్డు యూజర్లుకు ఇకపై ఎయిర్‌పోర్ట్, రైల్వే లాంజ్ యాక్సెస్ సేవల్లో కీలక మార్పులు రానున్నాయి. కొన్ని సేవలు పూర్తిగా ఆగిపోనున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
రూపే ప్లాటినం డెబిట్ కార్డు (RuPay Platinum Debit) యూజర్లకు ఇకపై ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉండదు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌గానూ ఈ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. అయితే, మార్చి 31, 2026 వరకు మాత్రం ఈ కార్డులపై లాంజ్ యాక్సెస్ ఉంటుందని, అర్హతలు ఉన్న వారు సేవలు పొందవచ్చని తెలిపింది. అయితే, కొన్ని ఎంపిక చేసిన కార్డులకు ఖర్చు ఆధారంగా లాంజ్ యాక్సెస్ కొనసాగిస్తున్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. ఈ నిబంధన సైతం ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వస్తుంది. రూపే క్రెడిట్ కార్డు యూజర్లు తమ బ్యాంక్ నిర్దేశించిన లిమిట్ మేరకు ఖర్చు చేసి అర్హత సాధిస్తే ఎయిర్‌పోర్ట్, రైల్వే లాంజ్ యాక్సెస్ పొందవచ్చని తెలిపింది.

