యుద్ధ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుదేలు.. సెన్సెక్స్ 6700 పాయింట్లు పతనం, ఇన్వెస్టర్లకు రూ.33 లక్షల కోట్ల నష్టం

Date:

Investors Wealth: కొద్ది రోజుల క్రితం వరకు భారత స్టాక్ మార్కెట్ సూచీలు కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ పెద్దగా పడిపోలేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో మార్కెట్ సూచీలు తీవ్రంగా కుదేలవుతున్నాయి. ఈ వారం కూడా సూచీలు భారీగా పతనమవగా.. మార్చి నెలలో సెన్సెక్స్ 6700 పాయింట్లకు పైగా పడిపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది.

Crude Oil Prices: భారత స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. యుద్ధ ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తూ మార్కెట్లపై స్పష్టమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ చమురు నౌకలను అడ్డుకోవడం వల్ల సరఫరాపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో సూచీలు వరుసగా పతనం అవుతున్నాయి.

ఈ వారం మార్చి 9 నుంచి 13 వరకు గమనిస్తే.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 4,355 పాయింట్లు పడిపోయింది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 1,299 పాయింట్లు తగ్గింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.19.86 లక్షల కోట్లు తగ్గింది. శుక్రవారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,471 పాయింట్లు క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది.

ఇక యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే.. శని, ఆదివారాలు అలాగే హోలీ సెలవును మినహాయిస్తే కేవలం 9 ట్రేడింగ్ సెషన్లలోనే సెన్సెక్స్ 6,723 పాయింట్లు పడిపోయింది. అదే సమయంలో నిఫ్టీ 2,027 పాయింట్లు తగ్గింది. ఈ 9 రోజుల వ్యవధిలో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.33.68 లక్షల కోట్లు తగ్గింది. దీంతో యుద్ధం ప్రభావం ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగులుస్తోంది.

మొత్తం మీద భారత స్టాక్ మార్కెట్లకు ఇప్పటివరకు మార్చి నెల అత్యంత కష్టకాలంగా మారింది. అదే విధంగా ఈ వారం అత్యంత అధ్వానంగా నిలిచే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు అమెరికా టారిఫ్ ప్రభావం, అలాగే ఆంథ్రోపిక్ వంటి ఏఐ టూల్స్ కారణంగా ఐటీ కంపెనీలపై మాత్రమే ఎక్కువ ఒత్తిడి కనిపించింది. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో మార్కెట్లపై పెద్దగా ప్రభావం పడలేదు. కానీ ఇప్పుడు యుద్ధ ప్రభావంతో ముడి చమురు ధరలు పెరగడం మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తోంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో ఇన్వెస్టర్లు షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. ఫలితంగా అనేక ప్రధాన కంపెనీల షేర్లు వరుసగా పడిపోతూ.. కొన్ని స్టాక్స్ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయిలను తాకాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...