కరీంనగర్ సీపీ జల్సాలు.. ప్రైవేటు వ్యక్తులకు ఏకే-47, బుల్లెట్లు.. కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Date:

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. మరోసారి కరీంనగర్ సీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీపీకి జల్సాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులకు ఆయుధాలు ఇచ్చి కరీంనగర్ సీపీ కాల్పులు జరిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఏకే-47, పిస్టల్స్, బుల్లెట్లు ఎలా ఇచ్చి కాల్చేలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే సీపీ లీలలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు బయటపెడతానని కౌశిక్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. పోలీస్ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ సీపీకి జల్సాలు ఎక్కువ అయ్యాయని.. చట్టాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాలను.. ఆయన ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి కాల్పులు జరిపిస్తున్నారని సంచలన ఆరోపణలకు తెర తీశారు.

గతేడాది సెప్టెంబర్ నెలలో కరీంనగర్ ఫైరింగ్ రేంజ్‌లో సీపీ గౌస్ ఆలం భార్య, ఆమె ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకే-47, తుపాకులతో సుమారు 160 బుల్లెట్లను కాల్చారని.. అయితే ప్రైవేట్ వ్యక్తులు వీటిని ఎలా ఉపయోగిస్తారని ఆయన నిలదీశారు. ఈ కాల్పుల్లో బోనాలపల్లిలో అమృతమ్మ అనే వృద్ధురాలికి బుల్లెట్ గాయం అయినట్లు పేర్కొన్న కౌశిక్ రెడ్డి.. అది తెలియక ఆమె రాయి తగిలిందని భావించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయం బయటికి పొక్కకుండా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...