ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదిరిపోయే ఉగాది గిఫ్ట్ నేటి నుంచి వీరికి కూడా ఫ్రీ బస్.. ఈ బస్సుల్లోకే ఎంట్రీ

Date:

ఏపీలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది. ‘దివ్యాంగ శక్తి’ పథకం పేరుతో దీనిని అమలు చేయనున్నారు. ఈ మేరకు బుధవారం పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. మంగళగిరిలో ఈ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు.

దీంతో నేటి నుంచి రాష్ట్రమంతటా దివ్యాంగులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ పథకం వర్తింపచేయనున్నారు. 4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ విస్తరించనుండగా. వీరి వెంట వచ్చే సహాయకులకు బస్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ది చేకూరనుంది. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.207 కోట్ల వ్యయం కానుంది. ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది.

గతేడాది డిసెంబర్ 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు. స్త్రీ శక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అందనుంది. ఏపీఎస్‌ ఆర్టీసీలో సుమారు 73 శాతం బస్సులకు ఈ పథకాన్ని వర్తింపచేశారు. ఇప్పటికే దివ్యాంగులు, వారి సహాయకులకు 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిన పాసులు ఈ కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడతాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...