అందుకే సీఎస్కేకి వచ్చా.. రాజస్థాన్ రాయల్స్‌ను వీడటంపై సంజు శాంసన్ రియాక్షన్

Date:

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ట్రేడ్ డీల్ ద్వారా జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు పంపి.. సంజు శాంసన్‌ను సీఎస్కే జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సంజు శాంసన్ ఎట్టకేలకు స్పందించాడు.

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ట్రేడ్ డీల్ ద్వారా జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు పంపి.. సంజుని సీఎస్కే జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సంజు శాంసన్ ఎట్టకేలకు స్పందించాడు. జట్టు ఎందుకు మారాల్సి వచ్చిందనే దానిపై స్పష్టతనిచ్చాడు.

‘రాజస్థాన్ రాయల్స్ జట్టులో నా సమయం ముగిసిందని భావించా.. అందుకే ఆ జట్టు నుంచి బయటకు వచ్చా. నేను ఆర్ఆర్‌కు ప్రత్యర్థిగా ఆడటం ఇదే మొదటిసారి. ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు. అయితే నేను ఒక్కసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్ గురించి తప్ప ఇంకేమీ ఆలోచించను. రాజస్థాన్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా తెలిసిన వాళ్లే. వారు నా పట్ల ఎంతో ప్రేమ చూపిస్తారు. కానీ ప్రతి ఒక్కరికీ ఓ సమయం అనేది ఉంటుంది. ఆర్ఆర్‌తో నా సమయం ముగిసింది. నేను ముందుకుసాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్ రాయల్స్‌పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా’ అని సంజు వెల్లడించాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...