D Spiritual: Nov 20: శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.5 లక్షల విలువైన వెండి స్ఫటిక పాత్ర కానుక

తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.5 లక్షల విలువైన వెండి స్ఫటిక పాత్రను కానుకగా సమర్పించారు. టీటీడీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ బి. శ్రీధర్ వర్మ శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ అధికారులకు ఈ వెండి పాత్రను అందజేశారు.

అనంతరం శ్రీధర్ వర్మ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీధర్ వర్మ సతీమణి, కార్పొరేటర్ జ్యోత్స్న, ఇతర కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *