
తిరుమల శ్రీవారి భక్తులకు సౌత్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మచిలీపట్నం నుంచి తిరుచానూరుకు 07440/07439 ప్రత్యేక రైలును ప్రకటించింది. మచిలీపట్నం నుంచి తిరుచానూరుకు రైలు ప్రతి శుక్ర, శనివారాల్లో, తిరుచానూరు నుంచి మచిలీపట్నానికి ప్రతి శని, ఆదివారాల్లో నడుస్తుంది.
మచిలీపట్నంలో సాయంత్రం 4.55 గంటలకు బయల్దేరి విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తిరుచానూరుకు రాత్రి 2 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుచానూరులో ఉదయం 3.30 గంటలకు బయల్దేరి మచిలీపట్నానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు విజయవాడ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
అలాగే గుంటూరు–చర్లపల్లి మధ్య 07227/07228 ప్రత్యేక రైలును కూడా ప్రకటించారు. గుంటూరు నుంచి చర్లపల్లికి రైలు ప్రతి ఆదివారం, చర్లపల్లి నుంచి గుంటూరుకు ప్రతి సోమవారం నడుస్తుంది.
గుంటూరులో రాత్రి 9.45 గంటలకు బయల్దేరే రైలు చర్లపల్లికి ఉదయం 4 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చర్లపల్లి నుంచి రాత్రి 11.50 గంటలకు బయల్దేరి గుంటూరుకు ఉదయం 6.10 గంటలకు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ రైళ్ల సమయాలను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.
