
పలాస-కాశీబుగ్గ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల పలాస మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన వజ్జ గంగాభవాని, కూటమి కౌన్సిలర్లు శుక్రవారం నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వారిని అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక అని పేర్కొన్న ఆయన పార్టీ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు గౌరవం అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి, టీడీపీ నాయకులు పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావు యాదవ్, మల్లా శ్రీనివాస్, గాలి కృష్ణారావు, బి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన గొర్లె విజయకుమారి కూడా నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జి.మాధవరావు, తిరుపతిరావు, గోవిందరావు, లక్ష్మిజీ, వెంకటరమణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
