అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు

Date:

ఏపీ రాజధాని అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు పడింది. ఎస్‌బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తైంది.

అమరావతి, ఆగస్టు 21: ఏపీ రాజధాని అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు పడింది. ఎస్‌బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తైంది. ఐనవోలులో మొత్తం 2.05 ఎకరాల్లో SBI నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. దాదాపు రూ.214 కోట్లతో SBI హౌసింగ్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. 4.46 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో నిర్మాణం జరుగనుంది. జూన్, 2027లో ‌నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. 2028లోపు నివాస సముదాయం పూర్తి చేయడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

ఇక, లింగాయపాలెం-ఉద్దండరాయునిపాలెంలో 3 ఎకరాల్లో SBI ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. SBI కార్యాలయానికి గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతిని జాతీయ స్థాయి ఆర్థిక, పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి ఎస్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం, ఎస్‌బీఐ సిబ్బంది నివాస సముదాయ నిర్మాణం మరో ముఖ్యమైన అడుగుగా నిలవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...