
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో కూటమి పార్టీలు ఘన విజయం సాధించి రాజకీయ చరిత్రను తిరగరాశాయి. గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు బలమైన పట్టున్న ఈ మండలంలో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఏకంగా 14 స్థానాలను కైవసం చేసుకోగా జనసేన ఒక స్థానంలో విజయం సాధించింది. వైసీపీ ఒక్క స్థానానికే పరిమితమైంది.
ఈ ఫలితాలతో కోటవురట్ల మండలంలో కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాల్లో మునిగిపోయారు. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలకు కంచుకోటగా ఉన్న మండలంలో కూటమి సాధించిన ఈ విజయం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించగా పలు ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాత్రి 8 గంటలలోపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
