Andhra: ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అలా అయితే మీ ప్రాణాలకే ముప్పు..

Date:

ఇంటి ముందు చల్లుకునే కళ్లాపి పొడిలో ప్రమాదకర రసాయనం ఉన్నట్లు కడప జిల్లా పోలీసులు వెల్లడించారు. ప్రొద్దుటూరులో తయారవుతున్న కొన్ని కళ్లాపి పొడుల్లో అరోమైన్-ఓ అనే రసాయనం ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలిందని తెలిపారు. ఈ రసాయనం ఆరోగ్యానికి హానికరమని, దీనిపై చర్యగా ఏడు తయారీ పరిశ్రమలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

ఒకప్పుడు ఇంటి ముందు కళ్లాపి చల్లాలంటే ఆవు లేదా గేదె పేడను నీటిలో కలిపి ఉపయోగించేవారు. కానీ కాలం మారడంతో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పేడ సులభంగా దొరకకపోవడంతో, మార్కెట్లో కళ్లాపి పొడి పేరుతో ప్యాకెట్లలో విక్రయించే ఉత్పత్తుల వినియోగం పెరిగింది. నీటిలో కలిపి చల్లితే పేడనీళ్ల మాదిరిగానే కనిపిస్తుండటంతో చాలామంది వాటినే వాడుతున్నారు.

అయితే ఈ కళ్లాపి పొడిపై తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పొడిలో అరోమైన్-ఓ అనే ప్రమాదకర రసాయనాన్ని ఉపయోగిస్తున్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలినట్లు కడప జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ రసాయనం మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలం దీని ప్రభావానికి గురైతే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కడప జిల్లాలోని ప్రొద్దుటూరును కేంద్రంగా చేసుకుని ఈ కళ్లాపి పొడిని తయారు చేసి ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇటీవల శ్రీ సౌభాగ్య కళ్లాపి పొడి పరిశ్రమలో పోలీసులు, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గత కొంతకాలంగా దాదాపు 19 మంది ఆత్మహత్యకు ఈ పొడిని ఉపయోగించినట్లు కేసులు నమోదుకావడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇందులో ఉపయోగిస్తున్న రసాయనాలపై పరీక్షలు నిర్వహించగా ప్రమాదకర అంశాలు బయటపడ్డాయని కడప జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ తెలిపారు.

ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టిన అధికారులు ప్రొద్దుటూరులో కళ్లాపి పొడిని తయారు చేస్తున్న ఏడు పరిశ్రమలను సీజ్ చేశారు. అలాగే ఈ ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

ఇంటి ముందు కళ్లాపి చల్లుకోవడం మన సంప్రదాయం. అయితే మార్కెట్లో లభించే ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యత, భద్రతపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గుడిపాల నుంచి తమిళనాడుకు జోరుగా ఇసుక అక్రమ రవాణా?

చిత్తూరు: తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుడిపాల మండలంలో ఇసుక అక్రమ రవాణా...

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...