Andhra Pradesh: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

Date:

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 స్టార్టప్ సంస్థలతో కలిసి వైద్య పరీక్షలు, ఇతర సేవల్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఏఐ సేవలతో అతి తక్కువ సమయంలో వ్యాధి నిర్ధారణ, రోగులకు చికిత్స అందించే సమయం కూడా ఆదా అవుతుందంటున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వీటి ఫలితాలను విశ్లేషించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదక ఇస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్.

వ్యాధుల్ని ప్రాథమిక పరీక్షలతో గుర్తించి.. తక్కువ సమయంలో మెరుగైన వైద్యసేవలు అందించొచ్చు. డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంభాషణ రికార్డు చేస్తారు ఏఐ అప్లికేషన్ల సాయంతో పరీక్షలు చేసి ప్రాథమిక దశలోనే సమస్యల్ని గుర్తిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో క్యాన్సర్ గుర్తింపు, క్షయను గుర్తించడానికి, షుగర్, కిడ్నీ, థైరాయిడ్, రక్తపరీక్షలు కూడా ఏఐ ఆధారిత పరికరాలతో చేస్తున్నారు.

గుండె సమస్యలు, ఐసీయూలో ఉన్నవారికి బీపీ, పల్స్, టెంపరేచర్, ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణ లాంటి మరికొన్ని చోట్లో అందుబాటులో ఉన్నాయి. ఏఐ సాయంతో ఏపీ ప్రభుత్వం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు మంత్రి సత్యకుమార్. సుమారు 40 అత్యాధునిక పరికరాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Thalliki Vandanam: ఈ రెండు పనులు ఇంకా పూర్తి చేయలేదా..? తల్లికి వందనం కట్.. అకౌంట్లో డబ్బులు పడనట్లే..

తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ...

Hyderabad: ఓల్డ్‌సిటీ ప్రైవేట్‌ స్కూల్‌లో కలకలం.. కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్‌ వర్క్‌..

అయితే ఈ ఘటనపై స్కూల్‌ ఎండీ‌ మాట్లాడుతూ.. ఖురాన్‌ హోం వర్క్‌...

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది....

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...