ఏపీలో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.

రాష్ట్రంలోని పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. దానితోపాటు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *