
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి రానుంది. కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, మినీరత్న హోదా కలిగిన గోవా షిప్‌యార్డు లిమిటెడ్ మచిలీపట్నం పోర్టులో షిప్‌యార్డు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.8 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని సంస్థ నిర్ణయించింది.
భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌తో పాటు వాణిజ్య నౌకల నిర్మాణం, మరమ్మతులు, లైఫ్‌సైకిల్ సపోర్ట్ అందించేలా ఈ షిప్‌యార్డును అభివృద్ధి చేయనున్నారు. గతేడాది విశాఖపట్నంలో జరిగిన పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వంతో గోవా షిప్‌యార్డు అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది.
ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి
మొత్తం మూడు దశల్లో ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదించారు. 2028 నాటికి తొలి దశను పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
షిప్‌యార్డు కోసం సుమారు 400 ఎకరాల భూమి, 1.7 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్ మౌలిక సదుపాయాలు అవసరమని సంస్థ ప్రతిపాదించింది. ప్రస్తుతం మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కొంత భూమిని ఏపీ మారిటైం బోర్డుకు బదిలీ చేయనున్నారు. మిగిలిన భూమిని సేకరించనున్నారు.
ప్రాజెక్టు వ్యయంలో రూ.2,400 కోట్లను సంస్థ అంతర్గత వనరుల ద్వారా సమ
