Weather: బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురువనున్నాయి. మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు అంచనా వేశారు. అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవగా.. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది.

నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో తూర్పు గాలుల ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొమొరిన్ ప్రాంతం నుండి రాయలసీమ వరకు, అంతర్గత తమిళనాడు మీదుగా ఒక తూర్పు గాలుల ద్రోణి విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానములో దిగువ ట్రోపోఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణశాఖ జారీ చేసింది.

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30నుండి 40కి.మీ గరిష్ఠంగా 50 కి. మీ వేగంతో వీచే అవకాశం ఉంది. పొగ మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు రాయలసీమలో కూడా రాబయే మూడ్రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని, పొగ మంచు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో నవంబర్ 24న మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అటు అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సైతం అక్కడక్కడ వర్ష సూచనలు కనిపిస్తున్నాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనాలు వేశారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో నిన్నటి రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. నెల్లూరుతో పాటు పలు పరిసర ప్రాంతాల్లో వర్షం కారణంగా తడిసి ముద్దైయ్యాయి. వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణకు వర్షసూచన

ఇక తెలంగాణకు కూడా వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. పలు ప్రాంతాల్లో జల్లులు పడతాయని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *