AP MPTC, ZPTC Elections 2026: Polling Continues Amid Political Tensions; YSRCP Cadres Stay Away from Voting in Some Areas

ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పలు జిల్లాల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రాజకీయ వివాదాలు, పోలీసుల చర్యలు, వర్షాల కారణంగా పోలింగ్‌కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో స్థానిక సమస్యలు, రిజర్వేషన్ల మార్పులపై నిరసనగా ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు.

కడప జిల్లాలో అత్యల్ప పోలింగ్‌.. రాష్ట్రవ్యాప్తంగా 4.80 శాతం నమోదు

రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 4.80 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాల వారీగా నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.

  • పల్నాడు జిల్లా: 12 శాతం
  • అనంతపురం జిల్లా: 9.44 శాతం
  • కాకినాడ జిల్లా: 8.83 శాతం
  • కడప జిల్లా: 0.5 శాతం

కడప జిల్లాలో అత్యల్పంగా పోలింగ్‌ నమోదవడం గమనార్హం.

గన్నవరంలో వృద్ధ మహిళలకు తప్పని ఇబ్బందులు

కృష్ణా జిల్లా గన్నవరంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సుమారు 15 వేల మంది ఓటర్లు ఉన్నారు. అయితే పోలింగ్‌ కేంద్రంలో కేవలం మూడు వీల్‌చైర్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ మహిళలు ఓటు వేసేందుకు అవస్థలు పడ్డారు. ఈ పరిస్థితిని గమనించిన హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు స్వయంగా తన చేతులపై వారిని ఎత్తుకుని పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించారు.

కొత్త నాగులూరులో ఓటింగ్‌కు దూరంగా వైసీపీ శ్రేణులు

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరులో వైసీపీ శ్రేణులు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జోగి రమేష్‌ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఓటింగ్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పోలింగ్‌ కేంద్రాల్లో పార్టీ తరఫున ఏజెంట్లను కూడా నియమించలేదు.

కాకినాడలో 8.83 శాతం పోలింగ్‌

కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 8.83 శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

కైకలూరు నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉదయం నమోదైన పోలింగ్‌ శాతం ఇలా ఉంది.

  • కైకలూరు: 14.2 శాతం
  • కలిదిండి: 24.6 శాతం
  • మండవల్లి: 2 శాతం
  • ముదినేపల్లి: 46 శాతం

ధూళిపాళ్లలో టీడీపీ నాయకుల హల్‌చల్‌!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకులు పోలింగ్‌ బూత్‌లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.

వర్షంలోనూ ఓటు వేస్తున్న ప్రజలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కలిగిరి మండలంలోని పెద్దకొండూరు, క్రాకుటూరు, కుమ్మరికొండూరు, పోలంపాడు తదితర గ్రామాల్లో వర్షం తీవ్రంగా పడుతున్నప్పటికీ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు. వర్షాన్ని లెక్కచేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

రిజర్వేషన్ల మార్పుతో ఎన్నికల బహిష్కరణ

అనకాపల్లి జిల్లా రోంగనివానిపాలెంలో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. రిజర్వేషన్ల మార్పుపై అసంతృప్తితో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. విశాఖ జిల్లా భీమిలి మండలం రాయనిపేటలోనూ స్థానికులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలోని చెరువు దుర్వాసన, మురుగునీటి సమస్యలను పరిష్కరించకపోవడంతో నిరసనగా ఓటు వేయబోమని ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ఓటు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గన్నవరం, అనంతపురంలో వైసీపీ నేతల హౌస్‌ అరెస్టులు

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పలువురు వైసీపీ నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బాపులపాడు మండలం తిప్పనగుంటలో ముల్పూరు ప్రభుకాంత్‌ను గృహ నిర్బంధం చేయగా, బైండోవర్‌ కేసుల పేరుతో తేలప్రోలు రామును ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. మరికొందరు నాయకులను కూడా పోలీస్‌స్టేషన్లకు పిలిపించారని ఆరోపించారు.

అనంతపురంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేసినట్లు సమాచారం. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా తమను నిర్బంధించడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏలూరులో ప్రశాంతంగా పోలింగ్‌

ఏలూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

స్టాంపు ప్యాడ్‌ పనిచేయక గంటపాటు నిలిచిన పోలింగ్‌

నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని 21వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో స్టాంపు ప్యాడ్‌ పనిచేయకపోవడంతో గంటకు పైగా ఓటింగ్‌ నిలిచిపోయింది. ఎన్నికల సిబ్బంది గుర్తింపు కార్డులు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వార్డుల వివరాల్లో గందరగోళం కారణంగా ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మాకవరపాలెంలో పోలింగ్‌కు అంతరాయం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని మాకవరపాలెం మండల కేంద్రంలో 31, 32, 33, 34 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ నిలిచిపోయింది. బీఎల్‌వోలు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లోని వివరాలు, ఓటర్ల జాబితాలోని వరుస సంఖ్యలు సరిపోలకపోవడంతో సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.

పార్నపల్లెలో ఉద్రిక్తత.. అవినాష్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పార్నపల్లెలో పోలింగ్‌ ఏజెంట్ల అనుమతి విషయంలో వివాదం తలెత్తింది. వైసీపీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించడం లేదని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ కారణంగా పోలింగ్‌ ప్రారంభం ఆలస్యమైంది.

సమాచారం అందుకున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పార్నపల్లెకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీ ఏజెంట్లను లోపలికి అనుమతించే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. ఏజెంట్లను అనుమతించకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని విమర్శించారు.

for more:Mptc zptc election ubdates in dtv digital

మండ్లెం పోలింగ్‌ కేంద్రం వద్ద నిరసన

నంద్యాల జిల్లా మండ్లెం పోలింగ్‌ కేంద్రంలో వైసీపీ ఏజెంట్లను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏజెంట్లు పోలింగ్‌ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వారిని బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

పల్నాడులో వైసీపీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పల్నాడు జిల్లా గురజాల మండలంలోని పులిపాడు, దైద, తెలుకుట్ల, గంగవరం, చర్లగుడిపాడు ప్రాంతాల్లో వైసీపీ ఎన్నికల ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్