
నంద్యాల జిల్లాలో టీడీపీకి ఆధిక్యం
నంద్యాల జిల్లా నంద్యాల మండలం ZPTC పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం సాధించింది. మొత్తం 23 ఓట్లు పోలవగా, టీడీపీకి 15, వైసీపీకి 8 ఓట్లు వచ్చాయి. అలాగే MPTC పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీకి 15, వైసీపీకి 7 ఓట్లు నమోదయ్యాయి.

అనంతసాగరంలో టీడీపీ ముందంజ
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ZPTC పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం ఓట్లలో టీడీపీకి 85, వైసీపీకి 45, బీఎస్పీకి ఒక ఓటు వచ్చాయి. మరో రెండు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ లెక్కింపులో టీడీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు.
చిల్లకూరులోనూ టీడీపీ ఆధిక్యం
గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం MPTC పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ముందంజలో నిలిచింది. మొత్తం 66 ఓట్లు పోలవగా, టీడీపీకి 45, వైసీపీకి 16, జనసేనకు 4, బీజేపీకి ఒక ఓటు లభించాయి.
దుత్తలూరులో టీడీపీకి 52 ఓట్లు
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ZPTC పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీడీపీకి 52, వైసీపీకి 11 ఓట్లు వచ్చాయి. మరో మూడు ఓట్లు నోటాకు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు.
దగదర్తిలో టీడీపీకి ఆధిక్యం
నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో మొత్తం 56 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీడీపీకి 26, వైసీపీకి 10, జనసేనకు 5 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు నోటాకు నమోదైంది.
మునగపాకలో 34 చెల్లని ఓట్లు
అనకాపల్లి జిల్లా మునగపాక ZPTC పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో మొత్తం 79 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీడీపీకి 26, వైసీపీకి 19 ఓట్లు వచ్చాయి. అయితే 34 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి.
పలు మండలాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మిగిలిన ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కొనసాగుతోంది.
