భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్, జూన్‌లో కాదు అప్పుడే?

Date:

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ముందుగా అనుకున్న జూన్ నెలకంటే ఒకట్రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్ట్ నెలలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అలాగే రహదారుల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. వీటికితోడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కాస్త ఆలస్యం కావొచ్చనే వార్తలు వస్తున్నాయి.

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే ముందుగా అనుకున్న జూన్ నెలకంటే ఒకటి, రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టులో ఇంటీరియర్ వర్క్స్, ఏటీసీ తుది మెరుగులు పూర్తి కావాల్సి ఉంది. అలాగే ప్రధాన రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు జరుగుతున్నాయి. వీటికి తోడు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన షెడ్యూల్ కూడా ఖరారు కావాల్సి ఉంది. ఈ పరిస్థితులలో ఆగస్ట్ నెలలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభమయ్యే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారు.

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు.. దేశంలోనే రెండో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా గుర్తింపు పొందింది. పీపీపీ విధానంలో జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (GVIAL) దీనిని నిర్మిస్తారు. రూ.4,727 కోట్లతో తొలి దశ పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకూ 3,800 మీటర్ల మేరకు రన్ వే, 40 చెక్ ఇన్ కౌంటర్లు, 12 డిజ యాత్ర పాడ్స్ ఏర్పాటు చేశారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

IRCTC: హైదరాబాద్ నుంచి కాణిపాకం–శ్రీపురం.. 3 పుణ్యక్షేత్రాల దర్శనానికి టూర్ ప్యాకేజీ

కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను...

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...