
California Almonds | దీపావళి వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు కాలిఫోర్నియా ఆల్మండ్స్ ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ (ప్రతి స్నేహితునికి బాదం) పేరుతో సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. భారతీయ సంస్కృతిలో దీపావళి సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా యువత బహుమతులు ఇచ్చే విధానంలోనూ కొత్త మార్పులు కనిపిస్తున్నాయి.
నేటి యువత ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టడం, కొత్త నగరాలకు వెళ్లడం, తమ అభిరుచులకు అనుగుణంగా కొత్త స్నేహ బంధాలను ఏర్పరచుకోవడం వంటి మార్పులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో పాటు ఆఫీసు సహచరులు, జిమ్ స్నేహితులు, ప్రయాణాల్లో పరిచయమైన మిత్రులు, కాఫీతో స్నేహాన్ని పంచుకునే వారితోనూ అనుబంధాలను పెంచుకుంటున్నారు. తమ జీవితంలో భాగమైన ఇలాంటి ప్రతి ఒక్కరికీ బాదంను బహుమతిగా అందించాలని ఈ ప్రచారం ప్రోత్సహిస్తోంది.
ఉత్సాహభరితమైన సంగీత వీడియో, విభిన్న పాత్రలతో రూపొందించిన ఈ క్యాంపెయిన్.. దీపావళి బహుమతుల సంప్రదాయానికి సరికొత్త కోణాన్ని పరిచయం చేస్తోంది. కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం కాకుండా, తమ జీవిత ప్రయాణంలో తోడుగా నిలిచే స్నేహితులందరినీ గుర్తుచేసుకుని వారికి ప్రేమతో బహుమతులు అందించాలనే సందేశాన్ని ఈ ప్రచారం అందిస్తోంది.
సాంప్రదాయానికి ఆధునిక హంగులు.. ఆరోగ్యకరమైన కానుకగా బాదం పప్పులు
భారతీయ సంస్కృతిలో బాదం పప్పులను శుభకార్యాలు, పండుగల సందర్భంగా బహుమతిగా అందించడం తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, నేటి యువత అభిరుచులకు అనుగుణంగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే తమ ప్రచారం లక్ష్యమని ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ఇండియా మార్కెట్ లీడ్ మణి పాంధర్ తెలిపారు. ఆరోగ్యంపై శ్రద్ధను, ఆప్యాయతను ప్రతిబింబించే బాదం పప్పులు దీపావళి కానుకగా మంచి ఎంపికగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ వినూత్న ప్రచారం ద్వారా బాదం పప్పులను కేవలం పండుగల సమయంలో ఇచ్చే బహుమతిగానే కాకుండా, రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోదగిన పోషకమైన ఆహారంగా కూడా యువతకు చేరువ చేయాలని సంస్థ భావిస్తోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలపై ప్రసారమవుతున్న ఈ ప్రచార వీడియో స్నేహబంధాలు, ఆప్యాయతలను వేడుకగా జరుపుకోవాలనే సందేశాన్ని అందిస్తోంది. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తూ, ఆరోగ్యకరమైన కానుకల ప్రాధాన్యాన్ని చాటిచెప్పడమే ఈ ప్రచారం ప్రత్యేకత.
