
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. పోలింగ్ కేంద్రాల సమీపంలో స్వతంత్ర అభ్యర్థి పద్మజ ఓటర్లకు నగదు పంచుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
ఎంపీటీసీ-2 స్థానానికి పోటీ చేస్తున్న పద్మజ అనుచరులు ఓటర్లకు ఓటర్ స్లిప్పులతో పాటు నగదు కూడా అందిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఓటుకు డబ్బులు ఇస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై అధికారుల స్పందన, తదుపరి చర్యల వివరాలు తెలియాల్సి ఉంది.
