
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సరిహద్దును పంచుకునే చైనా సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలపై నిబంధనలు, పరిమితుల్ని కొంత వరకు సడలించింది. గతంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే కచ్చితంగా ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఆ నిబంధనను తొలగించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం రోజు పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది. ఇందులో భాగంగానే.. భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే చైనా సహా భారత్‌తో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై కఠిన నిబంధనల్ని సడలించి.. పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది. చైనా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, అప్ఘానిస్థాన్, మయన్మార్, పాకిస్థాన్ ఇలా మన పొరుగు దేశాలు.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే కచ్చితంగా ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనల్ని సడలించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు.. పొరుగు దేశాల కంపెనీలు.. భారత్‌లోని ఏ రంగంలోనైనా ప్రభుత్వ అనుమతి లేకుండా 10 శాతం వరకు పెట్టుబడుల్ని పెట్టొచ్చు. ఇక్కడ ఆటోమేటిక్ రూట్‌లో 10 శాతం లోపు ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఆ పరిమితి దాటితే మాత్రం అనుమతి ఇప్పటికీ తప్పనిసరిగా ఉంది.
గతంలో మన దేశంలోని ఏ రంగంలో అయినా మన సరిహద్దు దేశాలు పెట్టుబడులు పెట్టాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండగా.. తాజాగా దీన్ని తొలగించారు. ఈ మేరకు గతంలో తీసుకొచ్చిన ప్రెస్‌నోట్3 ని సవరించారు. ఇక ఎఫ్‌డీఐల విషయంలో రంగాల వారీగా ఉన్న పరిమితులు యథాతథంగానే కొనసాగుతాయని తెలిపింది.

