
D Educt: Nov 11: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షల టైం టేబుల్ విడుదల
ది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (CISCE) ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షల టైం టేబుల్‌ను నవంబర్ 10న విడుదల చేసింది.
ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 76 సబ్జెక్టుల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 3,106 పాఠశాలల నుంచి సుమారు 2.70 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
అలాగే, ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 9న ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీతో ముగియనున్నాయి. మొత్తం 60 సబ్జెక్టుల్లో నిర్వహించే ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 1,651 పాఠశాలల నుంచి 1,10,025 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డిసెంబర్ మధ్య నాటికి పంపిణీ చేయనున్నట్లు సీఐఎస్‌సీఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ తెలిపారు.
