CM Chandrababu: రాష్ట్రంలోని యువతకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలోనే లక్ష ఉద్యోగాలు!

Date:

సోమవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుపస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును శంకుస్థాపన చేసుకున్నారు.

ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షమంది యువతకు ఉద్యోగాలు వస్తాయని ఈ ప్రాజెక్టు రావడానికి కృషి చేసిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేష్‌ను అభినందిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భూమిని ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని. రూ.1.35 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సంస్థకు జాతీయ స్థాయిలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంచి పేరుందన్నారు.

ఇలాంటి సంస్థ ఏపీకి రావడం చాలా మంచి పరిణామని అందుకే చెబుతున్నానన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతుందని.. 2028 నాటికి ప్లాంట్‌లో మొదటి దశ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ రూపొందించారన్నారు.

2030 జూన్ నాటికి మొదటి బ్లాస్టర్ ఫర్సెన్, డిసెంబరు నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణం పూర్తి చేస్తారమన్నారు. అలాగే జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లేన్ల రహదారి కూడా పూర్తి అవుతుందన్నారు. పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా కోసం పైప్ లైన్ కూడా వేయబోతున్నారు.

ఈ ప్లాంట్ కోసం పైప్ లైన్ వేయాలని ప్రధానిని కోరితే వెంటనే అంగీకరించారు. ఉక్కు ఉత్పత్తి ఒక్కటే కాదు ఆర్ధిక లావాదేవీలతో విద్య, వైద్యం, ఉద్యోగాలతో ఈ ప్రాంత రూపు రేఖలు మారతాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Vice President C.P. రాధాకృష్ణన్ గారి ప్రసంగం: భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ ఆవిష్కరణ”

https://www.youtube.com/watch?v=BPPUSuTEhyE భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పీ. రాధాకృష్ణన్ గారు భారతదేశపు తొలి నాన్-GMO పాప్‌కార్న్...

Brain Health: పిల్లల నుంచి పెద్దల వరకు.. వాల్‌నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే!

వాల్‌నట్స్‌.. మెదడు ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తాయి? మన శరీరానికి అవసరమైన పలు...

నీరసం దూరం చేసి బలాన్నిచ్చే సూపర్‌ఫుడ్.. ఇలా చేస్తే నిమిషాల్లో టేస్టీ, హెల్దీ బ్రేక్‌ఫాస్ట్!

ఉదయం పూట రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండాలంటే పోషకాలు ఉన్న అల్పాహారం...

యశ్‌పై దిల్ రాజు నమ్మకం.. ‘టాక్సిక్’కు రూ.120 కోట్ల బిగ్ డీల్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక...