వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ ఛేజ్ సంస్థలకు సంబంధించిన సమాచారం సైబర్ దాడిలో లీక్ అయింది. ఈ విషయాన్ని ఆ సంస్థలే ఈరోజు (శుక్రవారం) ప్రకటించాయి.

 వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ ఛేజ్ సంస్థలకు సంబంధించిన సమాచారం సైబర్ దాడిలో లీక్ అయింది. ఈ విషయాన్ని ఆ సంస్థలే ఈరోజు (శుక్రవారం) ప్రకటించాయి. అయితే పేమెంట్స్ సమాచారం భద్రంగానే ఉందని పేర్కొన్నాయి. కస్టమర్ల వివరాలు మాత్రం లీక్ అయ్యాయని వెల్లడించాయి. తమ థర్డ్ పార్టీ సర్వీసులపై ఈ సైబర్ దాడి నిన్న (గురువారం) జరిగిందని ఆయా సంస్థలు తెలిపాయి.

తమ థర్డ్‌ పార్టీ సర్వీసులపై హ్యాకర్లు దాడి చేశారని జేపీ మోర్గాన్ ఛేజ్ వివరించింది. ఆసియా-పసిఫిక్ పరిధిలో తమ సర్వీసు ప్రొవైడర్లు సైబర్ దాడికి గురయ్యాయని వీసా సంస్థ తెలిపింది. మరోవైపు మాస్టర్ కార్డ్‌ వినియోగదారుల మెయిల్ ఐడీలు లీకయ్యాయి. కాగా ఇటీవలి కాలంలో అమెరికాలో వరుసగా సాంకేతిక సమస్యలు, సైబర్ దాడులు వెలుగు చూడడంతో వైట్‌హౌస్ సైబర్ సెక్యూరిటీ చీఫ్ సీన్ కెయిర్న్స్ రాజీనామా చేశారు. ఆయనపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే సాంకేతిక లోపాల కారణంగా అక్కడ వేలాది విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *