ఉద్రిక్తతలు ఉన్నా.. బంగారం ధర ఎందుకు భారీగా తగ్గుతోంది.. 5 ముఖ్య కారణాలు ఇవే

Date:

అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో సాధారణంగా బంగారం ధర పెరుగుతుంటుంది. కానీ గత 10 రోజుల్లో చూస్తే గోల్డ్ రేటు వరుసగా తగ్గుతూ వచ్చింది. వెండి ధర కూడా పెద్దగా పెరగలేదు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.

సాధారణంగా అంతర్జాతీయంగా ఏదైనా అనిశ్చితి తలెత్తితే.. సంక్షోభ పరిస్థితుల్లో.. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరిగి.. ఆటోమేటిక్‌గా దాని వాల్యూ కూడా భారీగా పెరుగుతుంటుంది. గత కొంత కాలంగా ఇదే జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీగా సుంకాల్ని పెంచినప్పుడు.. అదే విధంగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో,  చూసుంటాం. కానీ ఇప్పుడు అంతకుమించి పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య గత 10 రోజులుగా భీకర యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇది తీవ్ర భయాందోళనలకు కారణమైంది. చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడి ధరలు బీభత్సంగా పెరిగాయి.

యుద్ధం ప్రారంభం సమయంలో మార్చి నెల ఆరంభంలో ఒక దశలో ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5400 డాలర్ల మార్కును దాటింది. అక్కడి నుంచి చూస్తే ఈ 10 రోజుల్లో భారీగా తగ్గి మళ్లీ 5050 డాలర్ల స్థాయికి కూడా దిగొచ్చింది. ప్రస్తుతం 5150 డాలర్ల స్థాయిలో ఉంది. సిల్వర్ రేటు కూడా 90 డాలర్ల మార్కు దాటి మళ్లీ 80 డాలర్ల స్థాయికి పడిపోయింది. ప్రస్తతం 85 డాలర్ల మార్కు వద్ద ట్రేడవుతోంది

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు..

వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ...

అమరావతికి ‘సిగ్నేచర్’ గేట్‌వే.. కృష్ణానదిపై అద్భుత నిర్మాణం.. దీని ప్రత్యేకతలు ఇవే.

ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కూటమి...

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు.. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు...

ప్రపంచంలో యాడా లేని సరుకు మన ఏపీలోనే.. ఆ చేవ, దాని ధర వేరే లెవల్..

ప్రపంచంలోనే అరుదైన వృక్ష జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో,...