వాహనదారులకు షాకిచ్చిన ఆ ప్రభుత్వం భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

Date:

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధం మధ్య, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటాయి. అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదని భారత ప్రభుత్వ వర్గాలు మరోసారి పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఆక్టేన్‌ 92 పెట్రోల్‌పై రూ.24 పెంపు తర్వాత లీటర్‌కు రూ.317కు చేరింది.

ఇక ఆక్టేన్‌ 95 పెట్రోల్‌పై రూ.25 పెరిగింది. ధర పెరిగిన తర్వాత లీటర్‌ ధర రూ.365కు చేరింది. ఇక ఆటో డీజిల్‌పై రూ.22 పెరిగింది. దీంతో లీటర్‌ ధర రూ.303కు చేరింది. ఇక సూపర్‌ డీజిల్‌పై రూ.24 పెరిగింది. ధర పెరిగిన తర్వాత రూ.353కు చేరింది.

అలాగే కిరోసిన్‌పై రూ.13 పెరిగింది. ధర పెరిగిన తర్వాత లీటర్‌ ధర రూ.195 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లో ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధర భారీగా పెరిగింది. అక్కడ లీటర్‌ పెట్రోల్‌పై ఏకంగా 55 రూపాయలు పెంచేసింది పాక్‌ ప్రభుత్వం.

ఇదిలా ఉండగా, చమురు ధరలపై అమెరికా అలర్ట్‌ అయ్యింది. ధరలను అదుపు చేసేందుకు ట్రంప్‌ రంగంలోకి దిగారు. చమురు ధరలను అదుపు చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు వైట్‌ హౌస్‌ ప్రకటించింది. అయితే ఈ చమురు ధరలు పెరగడం తాత్కాలికమేనని వెల్లడించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...