కార్తీకమాసంలో అద్భుతం శివయ్యే ఆ ఊరికి వచ్చాడా..?

Date:

  • ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నది మరోసారి ఆధ్యాత్మిక చరిత్రను మెలకువ చేసింది. కురిచేడు మండలం ముష్ట్లగంగవరం సమీపంలో నది గర్భంలో వెలుగుచూసిన శివలింగం, నంది విగ్రహాలు గ్రామస్థుల్లో భక్తి భావం నింపేశాయి. కార్తీకమాసంలో స్వయంగా బయటపడటంతో శివుడే తమ ఊరు వచ్చాడని ఉత్సాహంగా పూజలు ప్రారంభించారు.
  • నదీపరివాహక ప్రాంతాలు ప్రాచీన కాలం నుంచి జనావాసాలకు అనుకూలంగా ఉన్నాయి. నదుల పక్కన జనావాసాలు ఏర్పరుచుకోవడానికి కారణం తాగునీటి సౌకర్యం, వ్యవసాయానికి అనుకూలమైన సారవంతమైన భూమి ఉండటం ప్రధాన కారణాలు.
  • ప్రపంచంలోని మానవ నాగరికతలు చాలావరకు నదులు, సముద్రాల పరీవాహక ప్రాంతాలు, అడవుల్లోని మంచినీటి చెలమలనుంచే ప్రారంభమయ్యాయి. నైలు నది పక్కన ఈజిప్షియన్‌, టైగ్రిస్-యూఫ్రటీస్ నదుల పక్కన మెసొపొటేమియన్‌, సింధులోయ నాగరికత సింధు నది ఒడ్డున ఏర్పడ్డాయి.
  • ఇక మన దేశంలో గంగా, గోదావరి, కృష్ణ, పెన్న ఇలాంటి నదీపరివాహక నదుల పక్కనే పట్టణాలు, గ్రామాలు ఏర్పడ్డాయి… అలా ఏర్పడిన నదులతో మానవ జీవితాలు ప్రభావితం అవుతుంటాయి… దేవాలయాలు, పూజనీయ, దర్శనీయ ప్రాంతాలు కూడా నదుల పక్కనే ఏర్పడ్డాయి.
  • అలాంటి నదుల్లో ప్రాచీన నాగరికతకు చెందిన ఆనవాళ్ళు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి… అలాంటి ఓ పురాతన విగ్రహాలు ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నదీపరివాహక ప్రాంతంలో తాజాగా బయటపడ్డాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...